కుడి ఎడమైతే వెబ్ సిరీస్ పై అడివి శేష్ ఏమన్నారంటే?

Published on Jul 25, 2021 2:33 pm IST


అమలా పాల్ మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే సర్వత్రా ఈ వెబ్ సిరీస్ పై పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో ప్రముఖ నటుడు అడివి శేష్ ఈ వెబ్ సిరీస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆహా లో వస్తున్న కుడి ఎడమైతే వెబ్ సిరీస్ గురించి చాలా సూపర్ విషయాలు విన్నాను అని అన్నారు. అంతేకాక దర్శకుడు పవన్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కుమార్ తనకు మంచి స్నేహితుడు అని, తెలివైన కథకుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అతను ఈ చిత్రం లో ఏమి చూపించారో చూడటం కోసం ఇంకా వేచి చూడలేను అని అన్నారు.

అంతేకాక తన నిర్మాతలు అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి అభినందనలు తెలిపారు. అయితే ఈ వెబ్ సిరీస్ పై అడివి శేష్ చేసిన వ్యాఖ్యల తో నెటిజన్లు స్పందిస్తున్నారు. వెబ్ సిరీస్ ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అమలా పాల్,రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి సారి గా టైమ్ లూప్ కాన్సెప్ట్ తో తెలుగు లో వెబ్ సిరీస్ ఉండటం తో కుడి ఎడమైతే కొనసాగింపు ఏమై ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :