“టక్ జగదీష్” విడుదల పై నాని కీలక వ్యాఖ్యలు!

Published on Aug 18, 2021 7:01 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరో గా, రీతూ వర్మ హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం ఓటిటి ద్వారా విడుదల అయ్యే అవకాశాలు ఉండటం తో నాని అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సినిమా విడుదల పై నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

థియేటర్ల కి తను పెద్ద అభిమాని అని, టక్ జగదీష్ పూర్తి తెలుగు సినిమా అంటూ చెప్పుకొచ్చారు. థియేటర్ల లో హౌజ్ ఫుల్ తో సినిమా చూడటానికి ఇష్ట పడతా అని తెలిపారు. థియేటర్ల లో చూడటం పండుగ లాంటి అనుభూతిని ఇస్తుంది అని అన్నారు. ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలతో తాను కూడా నలిగి పోతున్నట్లు పేర్కొన్నారు. థియేటర్ల లో ఈ సినిమా ను అందరితో పాటుగా చూడాలి అని అనుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ఇక్కడ మరియు విదేశాల్లో ఉన్న పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో థియేటర్ల పై ఉన్న ఆంక్షల తో పలు రకాలు గా సంఘర్షణ గా మారింది అని అన్నారు. నిర్మాతలు ఈ సమయం లో తీసుకొనే నిర్ణయం పై గౌరవం ఉంచుతున్నా అని అన్నారు.అయితే ఏదేమైనా ప్రతి ఒక్కరి వద్దకు ఈ సినిమా చేరడానికి కృషి చేస్తా అంటూ నాని తెలిపారు. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒక ప్రముఖ ఓటిటి దిగ్గజం లో వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :