“ఒకే ఒక జీవితం” టీమ్ ఫోటో ను షేర్ చేసిన శర్వానంద్!

Published on Jul 22, 2021 3:32 pm IST

శర్వానంద్ ఆది పాత్ర లో నటిస్తున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్స్ పతాకం పై ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో శర్వానంద్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం టీమ్ ఫోటో ను హీరో శర్వానంద్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో లో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ దర్శకుడు శ్రీ కార్తీక్ లతో పాటుగా హీరో హీరోయిన్ లు ఉన్నారు. అయితే ఈ ఫోటో షేర్ చేస్తూ శర్వా నంద్ ఒక కామెంt చేశారు. ఈ సినిమా ను మీకు చూపించేందుకు చాలా ఎదురు చూస్తున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే శర్వానంద షేర్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే శ్రీ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :