‘ఉప్పెన’లో ‘విజయ్ సేతుపతి’ పేలతాడట !

Published on Aug 25, 2019 10:01 am IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న కృతి శెట్టికి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఇటీవలే విజయ్‌ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకొన్నట్ల ఇటివలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. డేట్స్‌ కుదరకపోవడంతోనే విజయ్‌ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నారని ఆ మధ్య రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే విజయ్ సేతుపతి ఈ మూవీ నుండి తప్పుకోలేదని.. ఆయన ఇప్పటికే షూట్ లో కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.

‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు. ఇప్పటికే కీలక సన్నివేశాలను షూట్ చేసిన చిత్రబృందం అవుట్ ఫుట్ పరంగా చాల హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇక విజయ్ సేతుపతి రోల్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని సమాచారం.

సంబంధిత సమాచారం :