FIR ప్రెస్ మీట్ లో విష్ణు విశాల్ కీలక వ్యాఖ్యలు

FIR ప్రెస్ మీట్ లో విష్ణు విశాల్ కీలక వ్యాఖ్యలు

Published on Feb 6, 2022 11:06 PM IST


తెలుగు లో మరిన్ని సినిమాలు చేస్తా, త్వరలో తెలుగు లో మాట్లాడుతూ అంటూ చెప్పుకొచ్చారు హీరో విష్ణు విశాల్. త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేస్తా అని అన్నారు. ముందుగా రవితేజ మరియు గుత్తా జ్వాల లకి స్పెషల్ థాంక్స్. సినిమా విడుదల పై సైతం విష్ణు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల లోనే రిలీజ్ కి సిద్దం చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా పలు చిత్రాలు ఓటిటి బాట పడుతున్న సంగతి తెలిసిందే. అయిన థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినట్లు చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా భారీగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక చిత్రం దర్శకుడు మను ఆనంద్ పై మరియు తనతో పాటుగా చిత్రం లో నటించిన నటీనటులు పై ప్రశంసల వర్షం కురిపించారు. గుత్తా జ్వాల గురించి మాట్లాడుతూ, థియేటర్ల లో రిలీజ్ కావడానికి ముఖ్య కారణం తనే అని, తెలుగు లో కూడా డబ్ చేసి రిలీజ్ కి ముఖ్య కారణం తనే అంటూ చెప్పుకొచ్చారు. తనకు సపోర్ట్ గా నిలిచిన వారికి థాంక్స్ తెలిపారు. సడెన్ గా ప్రెస్ మీట్ ఉందని చెప్పి, సపోర్ట్ కావాలి అంటే సందీప్ కిషన్ వచ్చారు, చాలా గ్రేట్ ఫుల్ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఇద్దరూ కలిసి ఒకే సినిమాను తెలుగు వెర్షన్ లో సందీప్ మరియు తమిళ్ వెర్షన్ విష్ణు, ఒకే టైం లో షూటింగ్ చేశాం అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు లో తను రకుల్, తమిళ్ లో విష్ణు దివ్య చేసినట్లు తెలిపారు. అప్పటి నుండి తమ స్నేహ బంధం ఉంది అంటూ స్టేజ్ పై సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమం లో తన చిత్రం బృందం పై తనకు సపోర్ట్ గా నిలిచిన వారికి థాంక్స్ తెలిపారు విష్ణు విశాల్. గౌతం మీనన్, రెబా మోనికా, మంజిమ మోహన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ FIR చిత్రం ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు