“ఆదిపురుష్” నుంచి డిజప్పాయింట్ చేసారుగా..

Published on Oct 23, 2021 1:49 pm IST

ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు, ప్రముఖులు కూడా ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ స్పెషల్ రోజున ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ నుంచి పలు ఆసక్తికర అప్డేట్స్ కోసం కూడా అంతా ఎదురు చూడగా వాటిలో “రాధే శ్యామ్” నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా కాకుండా మరో భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఆశించారు కానీ దర్శకుడు ఓంరౌత్ ఇచ్చిన అప్డేట్ పోస్టర్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రీ లుక్ పోస్టర్ లాంటిది కూడా కానీ పోస్టర్ ని ఓంరౌత్ షేర్ చేసి నార్మల్ విషెష్ ని తెలిపాడు. దీనితో వారు మరింత డిజప్పాయింట్ చేసినట్టు అయ్యింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లు ఇతర అప్డేట్స్ లు ఇంకే స్పెషల్ డేస్ కి వస్తాయో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :