సుధీర్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ !

5th, November 2017 - 09:46:09 AM

హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను సెట్ చేసుకుని పనిచేస్తున్నారు. ఈయన నటించబోతున్న సినిమాల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రం కూడా ఉంది. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. ఆమే అదితిరావ్ హైదరి. స్వతహాగా హైదరాబాదీ అయిన ఈమె ఇప్పటి వరకు స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. కాబట్టి ఇదే ఆమెకు తెలుగు డెబ్యూట్ అనుకోవచ్చు.

సుధీర్ బాబు సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన మోహన్ కృష్ణ చాలా మందిని పరిశీలించి చివరికి అదితిరావ్ హైదరిని సెలెక్ట్ చేశారట. అదితి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. మరి వీరిద్దరి జోడీ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు అనే విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.