“హిట్ 2” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.!

Published on Jul 23, 2022 2:30 pm IST

రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర మంచి హిట్ గా నిలిచిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ నటించిన అవైటెడ్ ఎమోషనల్ చిత్రం “మేజర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తర్వాత తన కెరీర్ లో తన మార్క్ క్రేజీ థ్రిల్లర్స్ లైనప్ లో ఉండగా వాటిలో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”.

దర్శకుడు శైలేష్ కొలను మరియు నాచురల్ స్టార్ నాని నిర్మాతగా స్టార్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ “హిట్” కి సీక్వెల్ గా చేస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమాపై అయితే శేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించాడు. తాను అందుకున్న “మేజర్” హిట్ తో తాను ఆనందంగా ఉన్నానని అయితే నెక్స్ట్ ఇంకా హిట్ 2 లో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చెయ్యాల్సి ఉండగా..

దీని కోసం గాను నాని మరియు శైలేష్ తో మాట్లాడి తనకి కొంత సమయం పడుతుందని రిక్వెస్ట్ చేయగా వారు ఓకే చెప్పారని అందుకే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని సినిమా స్టార్ట్ చేస్తానని శేష్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే దీని తర్వాత అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిలీజ్ అప్డేట్ కూడా అతి త్వరలోనే ఇస్తామని సాలిడ్ అప్డేట్స్ అయితే తాను అందించాడు.

సంబంధిత సమాచారం :