“మేజర్” ఫైనల్ షూట్ కి ఒక రేంజ్ లో రెడీ అవుతున్న అడివి శేష్!

Published on Oct 21, 2021 2:15 pm IST


అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోని పిక్చర్స్ మరియు జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం అడివి సేష్ ఎంతో కష్ట పడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది.

ఈ చిత్రం కి సంబంధించిన ఫైనల్ షూట్ కి అడివి శేష్ ఒక రేంజ్ లో సిద్దం అవుతున్నారు. వర్కౌట్ చేసే వీడియో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అడివి శేష్. మేజర్ చిత్రం కోసం షేప్ లోకి వస్తున్నట్లు తెలిపారు. అడివి శేష్ షేర్ చేసిన ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం కోసం అడివి శేష్ కష్టపడుతుంటే, సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే దాని పై ప్రేక్షకులు, అభిమానులు చర్చలు జరుపుతున్నారు. తెలుగు తో పాటుగా, హిందీ భాషలో కూడా విడుదల కానున్న ఈ చిత్రం లో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :