కోవిడ్ పేషంట్లను సకాలంలో ఆదుకున్న అడివి శేష్

Published on May 4, 2021 4:00 pm IST

తెలుగు సినీ ప్రముఖులు కోవిడ్ కష్టాల్లో ఉన్నవారికి తమవంతు సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చేతనైన సహాయం చేస్తున్నారు. తాజాగా హీరో అడివి శేష్ ఒక ఆసుపత్రి మొత్తం ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలుసుకుని వెంటనే రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లోని కింగ్ కోటి ఆసుపత్రిలో కరోనా బాధితులు చాలా మంది చికిత్స తీసుకుంటున్నారు. పేషంట్లు, వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తం కలిసి 300 మంది వరకు ఆసుపత్రిలో ఉన్నారు.

అయితే ఆసుపత్రిలో తాగునీరు కొరత ఏర్పడింది. ఒక్కసారిగా తాగునీరు అయిపోవడంతో రోగ్యులు, వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అసలే ఎండాకాలం కావడంతో ఆసుపత్రిలోని చాలామంది డీహైడ్రేషన్ బారినపడ్డారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అడివి శేష్ తక్షణమే స్పందించి 850 లీటర్ల మినరల్ వాటర్ బాటిళ్లను ఆసుపత్రికి పంపారు. శేష్ చేసిన ఈ పని వలన 300 మందికి సకాలంలో మంచి నీరు అందింది. ఇదొక్కటే కాదు ఇకముందు కూడ ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్ఛని ఆసుపత్రి వర్గాలకు తెలిపారట ఆయన. శేష్ చేసిన ఈ సహాయం గురించి తెలిసి సామాజిక మాధ్యమాల్లో ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

సంబంధిత సమాచారం :