ఎవరు టీజర్: మర్డర్ మిస్టరీ

Published on Jul 19, 2019 5:57 pm IST

హీరో అడివి శేషు,రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ “ఎవరు”. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. అలాగే ముందుగా ప్రకటించిన విధంగానే నేడు మూవీ టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

ఆసక్తికరంగా టీజర్ ఓ రేప్ అటెంప్ట్ సన్నివేశంతో మొదలైంది. రెజీనా తనను బలాత్కరించబోయిన ఓ వ్యక్తిని షూట్ చేసి చంపడం జరిగింది. ఐతే ఈ సంఘటన వెనుకున్న అసలు నిజాలు విలికితీసే తమిళ నాడు పోలీస్ అధికారి అయిన అడివి శేషు రంగంలోకి దిగుతారు. రెజీనా కాసాండ్రా కాల్చి చంపిన వ్యక్తి పాత్రను నవీన్ చంద్ర చేసారనిపిస్తుంది. ఇక విక్రమ్ వాసుదేవ్ అనే పోలీస్ పాత్రలో శేషు లుక్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఒక నిమిషానిక పైగా ఉన్న టీజర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.

వెంకట్ రామ్ జి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళి శర్మ ఓ కీలక పాత్ర చేస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :