బయో పిక్ కోసం బరువు తగ్గుతున్నయంగ్ హీరో

Published on Aug 25, 2019 12:07 am IST

అశోక్‌ చక్ర అవార్డు పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్‌. యంగ్ హీరో అడివి శేషు ఉన్ని కృష్ణన్ పాత్రను చేస్తున్నారు. తాజాగా ఎవరు అనే ప్రయోగాత్మక ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్న శేషు మొదటిసారి బయో పిక్ లో నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాను సూపర్‌ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

ఐతే మిలటరీ అధికారిగా కనిపించేందుకు శేష్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడట. అందుకోసం మూడు నెలల్లో 10 కిలోలు బరువు తగ్గాల్సి ఉండటంతో ప్రత్యేక ట్రైనర్ ని నియమించుకొని మరి కసరత్తులు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :