త్వరలో అదుర్స్ సీక్వెల్ ఉంటుందన్న వినాయక్!

సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ డైరెక్ట్ చేసిన ‘ఇంటిలిజెంట్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ ఎక్కడా రాజీపడకుండా నిర్మించాడు. బ్రహ్మానందం, సప్తగిరి కామెడి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.

‘ఇంటిలిజెంట్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వినాయక్ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చిందని అన్ని వర్గాల వారిని ఈ సినిమా అలరిస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ‘అదుర్స్-2’ మూవీ గురించి డిస్కస్ చేస్తూ.. గతంలోనే ఈ సీక్వెల్ చెయ్యాలని ప్రయత్నం చేసాం కానీ కుదరలేదు. తప్పకుండా సీక్వెల్ చేస్తామని అన్నారు. గతంలో వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అదుర్స్’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.