భారీ డీల్స్ తర్వాతే కన్ఫామైన నితిన్ సినిమా?

Published on Sep 17, 2020 11:04 am IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం “భీష్మ”తో మంచి సాలిడ్ కంబ్యాక్ అందుకున్నాడు. దీనితో తాను నటిస్తున్న తర్వాత చిత్రాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అలా తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రంగ్ దే” విషయంలో జరిగినట్టు తెలుస్తుంది. వీరు ఎప్పటి నుంచో థియేట్రికల్ రిలీజ్ కు స్టిక్ అయ్యి ఉన్నప్పటికీ ఈ సినిమాకు మంచి ఓటిటి ధరలే పలికినట్టు తెలుస్తుంది.

ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ అయితే 35 కోట్లకు పైగానే ఆఫర్ చేశారట. కానీ చిత్ర యూనిట్ ఆ డీల్ ను కూడా వద్దనుకున్నారట. అలా చాలా డీల్స్ తర్వాతనే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో సంక్రాంతికి రేస్ కు ఉంచడం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More