ఇంటర్వ్యూ : నందు మల్లెల – మొదటి 20 ని.లు చూసి సాయి కొర్రపాటి సినిమా తీసుకుంటానన్నారు !
Published on Jul 5, 2017 1:29 pm IST


ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో వారాహి చలన చిత్రం సమర్పిస్తున్న ‘రెండు రెళ్ళ ఆరు’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నందు మల్లెల డైరెక్ట్ చేశారు. ఇంకొక రోజులో సినిమా రిలీజవుతున్న సందర్బంగా ఆయన సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) అసలు ‘రెండు రెళ్ళ ఆరు’ అనే టైటిల్ కు అర్థమేమిటి ?
జ) అంటే ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకునే ఒక నిర్ణయం ద్వారా ఆరుగురి జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అనే పాయింట్ మీద ఈ టైటిల్ పెట్టాను.

ప్ర) ఇంతకీ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ ప్లస్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అందరు ప్రేక్షకుల్లకి తప్పక నచ్చుతుంది.

ప్ర) సినిమా స్టోరీని ట్రైలర్ లోనే ఎందుకు రివీల్ చేశారు ?
జ) అంటే సినిమాలో అసలు ఏం ఉందో తెలియాలి కాబట్టి. అంతేగాక నన్ను చూసి సినిమాకు రావడానికి నాకెలాంటి గుర్తింపు లేదు. అందుకే స్టోరీ చెబితే నచ్చి థియేటర్లకు వస్తారని స్టోరీ చెప్పాను.

ప్ర) హీరో హీరోయిన్లిద్దరికీ హార్ట్ డిసీజ్ అనే థాట్ ఎలా వచ్చింది ?
జ) కొత్త కథ కోసం ఆలోచిస్తుంటే వచ్చిన ఆలోచన ఇది. అంతేగాక నాకు తెలిసిన ఒక కుటుంబలో ముగ్గురు మగ పిల్లలు 30 ఏళ్ళు వచ్చాక వరుసగా చనిపోయారు. అది కూడా నన్ను మోటివేట్ చేసింది.

ప్ర) సినిమాలో తాగుబోతు రమేష్ ద్వారా కొత్త తరహా కామెడీ చేయించారట ?
జ) అవును. అతని పాత్ర ఆడియన్సుకి ఒక ప్యాకేజ్ లాంటిది. అందుకే పోస్టర్, ట్రైలర్లలో ఎక్కడా రివీల్ చేయలేదు. అతను రెగ్యులర్ గా చేసే తాగుబోతు పాత్రలకి దీనికి చాలా తేడా ఉంటుంది.

ప్ర) సాయి కొర్రపాటిగారు ఈ సినిమాను ఎలా తీసుకున్నారు ?
జ) నేను ఈ కథ పట్టుకుని సాయిగారి చుట్టూ మూడు నెలలు తిరిగాను. అయినా ఆయన్ను కలిసే ఛాన్స్ దొరకాలేదు. చివరికి వేరొక నిర్మాతతో సినిమా స్టార్ట్ చేశాక మధ్యలో ఇబ్బందులు వచ్చి ఆగింది. అప్పుడు ఎవరో ఈ సినిమాను సాయిగారికి సజెస్ట్ చేశారు. ఆయన కూడా మొదటి 20 నిముషాల సినిమా చూడగానే తీసుకోవడానికి ఒప్పేసుకున్నారు.

ప్ర) మొదట్లోనే చిన్న హీరో హీరోయినుతో తీద్దామనుకున్నారా ?
జ) సంవత్సరం క్రితం ఈ సినిమా మొదలైంది. అప్పటికి నా దగ్గరున్న బడ్జెట్, నా మైండ్ సెట్ ప్రకారమే నటీ నటుల్ని ఎంచుకున్నాను.

ప్ర) ఇకపై ఎలాంటి సినిమాలు చేస్తారు ?
జ) పెద్ద పెద్ద బడ్జెట్ తో సినిమాలు చేసినా చేయకపోయినా మంచి విలువలుండే సినిమాలే తీస్తాను. అవి కూడా వాస్తవానికి దగ్గరగా ఉండేవే అయ్యుంటాయి. నేను పెరిగింది మధ్యతరగతి వాతావరణంలోనే కాబట్టి వాటికి సంబంధించే నా సినిమాలుంటాయి.

ప్ర) హీరో హీరోయిన్లకి డిసీజ్ అంటున్నారు. గీతాంజలి తరహాలో ఉంటుందా ?
జ) లేదు. అది ఇది పూర్తిగా డిఫరెంట్. అందులో వాళ్ళు చనిపోతారని హీరో హీరోయిన్లకి తెలుసు. కానీ ఇందులో హీరో హీరోయిన్ల తండ్రులకు మాత్రమే ఆ సంగతి తెలుసు.

ప్ర) వారాహి బ్యానర్లో సాయి కొర్రపాటిగారు నెక్స్ట్ ఛాన్స్ ఏమైనా ఇచ్చారా ?
జ) అవును. ఆయనకొక సినిమా చేస్తానన్నారు. అది కాకుండా ఇంకో స్క్రిప్ట్య్ చర్చల్లో ఉంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook