లుక్స్ పరంగా మరోసారి ప్రూవ్ అవుతున్న ప్రభాస్ డెడికేషన్.!

Published on Apr 29, 2021 10:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్న పలు సాలిడ్ పర్సనాలిటీస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కూడా ఒకటి. బాహుబలి సినిమా నుంచి పూర్తిగా తన డెడికేషన్ వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అయితే డెడికేషన్ అంటే కేవలం ఐదేళ్లు ఒకే సినిమాకు కేటాయించేసాడు అనే కన్నా ఆ సినిమా కోసం ఎలా మార్పులు చేసుకోగలిగాడు అన్నదే మెయిన్ పాయింట్.

అప్పట్లో అంటే ఇప్పుడున్న యువత ఇంటర్ లో ఉన్న సమయంలో ప్రభాస్ బాహుబలి అనే సినిమాకు అంత బరువు పెరిగాడని ఊహించని విధంగా కనిపిస్తాడని ఓ రేంజ్ లో మాట్లాడుకునేలా చేసాడు ప్రభాస్. మరి అలాంటి ప్రభాస్ ఇప్పటికీ కూడా సినిమాల కోసం తన పర్సనాలిటీని ఇంకా హూనం చేసుకుంటూనే ఉన్నాడు.

ఓ సినిమాకు కావాలంటే సాలిడ్ లుక్స్ లో కనిపిస్తూ మరో సినిమా షూట్ కోసం చాలా స్లిమ్ గా మారిపోతున్నాడు. ఇది మాత్రం మాములుగా విషయం చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు మరియు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవి చూస్తే ప్రభాస్ డెడికేషన్ ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రభాస్ స్లిమ్ అవ్వడం స్టార్ట్ చేసాడు అది కూడా రాధే శ్యామ్ బ్యాలన్స్ షూట్ కోసం అన్నట్టు తెలిసింది. దానితో పాటిగా మరో మూడు భారీ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :