మళ్ళీ 50 శాతం సీటింగ్ కు థియేటర్స్..మన దగ్గర ఏమవుతుందో?

Published on Apr 8, 2021 5:00 pm IST

గత ఏడాది తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మూలాన అత్యధికంగా నష్టాలు చూసిన పరిశ్రమ ఏదన్నా ఉంది అంటే అది సినీ పరిశ్రమే అని చెప్పాలి. ముఖ్యంగా థియేటర్లు మూసివేత అనే అంశం ప్రతీ ఒక్కరికీ చాలా బాధ కూడా తెప్పించింది. కానీ మెల్లగా మళ్ళీ కరోనా తగ్గడంతో 50 శాతం సీటింగ్ అన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అనుసరించి తెరవబడ్డాయి.

సరే తెరిచి మూడు నెలలు కూడా కాకుండానే మళ్ళీ కరోనా ఉదృతి పెరగడంతో ఆల్రెడీ ముంబైలో థియేటర్స్ మళ్ళీ మూత పడ్డాయి. అలాగే మన దక్షిణాదిన ఈ మధ్యనే కర్ణాటక ప్రభుత్వం 50 శాతం సీటింగ్ చెయ్యాలని ఉత్తర్వులు జారీ చెయ్యగా ఇప్పుడు ఇదే బాటలో తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ వచ్చే ఏప్రిల్ 10 నుంచి మళ్ళీ అక్కడ థియేటర్స్ 50 శాతం సీటింగ్ తోనే నడవాలని కన్ఫర్మ్ చేసారు. ఇక మిగిలి ఉన్న కీలక ఇండస్ట్రీ మనదే మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :