‘అజ్ఞాతవాసి’ కృష్ణా, గుంటూరు 3 రోజుల కలెక్షన్లు !
Published on Jan 13, 2018 3:34 pm IST

భారీ హైప్ నడుమ విడుదలైన పవ, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ చిత్రం మొదటిరోజున పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ సాధించినప్పటికీ మిక్స్డ్ టాక్ రావడంతో రెండవ రోజు నుండి వసూళ్ళలో ఊహించని తగ్గుదల కనబడింది. 1వ రోజు కృష్ణా జిల్లాలో రూ.1.82 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు బాగా తగ్గి మూడవ రోజు రూ.13.89 లక్షలు మాత్రమే రాబట్టి మొత్తంగా మూడు రోజులకు కలిపి రూ.2.28 కోట్లు మాత్రమే నమోదుచేసింది.

ఇక గుంటూరు జిల్లాలో మొదటి రోజు రికార్డ్ స్థాయిలో రూ.3.78 కోట్ల షేర్ ను వసూలు చేసి 2వ రోజు రూ.28.12 లక్షలకే పరితమై 3వ రోజు ఇంకా తగ్గి కేవలం రూ.13.37 లక్షలు మాత్రమే దక్కించుకొని మొత్తంగా 3 రోజులకు రూ.4.19 కోట్లను ఖాతాలో వేసుకుంది. మరి రాబోయే మూడు రోజుల పండుగ సెలవులనైనా ఈ చిత్రం క్యాష్ చేసుకుని పుంజుకుంటుందో లేదో చూడాలి.

 
Like us on Facebook