త్వరలో మంచు లక్ష్మీ తో విశ్వక్ సేన్ ఆహా భోజనంబు!

Published on Jul 19, 2021 8:43 pm IST

బుల్లి తెర కార్యక్రమాల ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే ఆహా వీడియో ఎన్నో వినూత్న ప్రయోగాలకు నాంది అవుతుంది. ఇప్పటికే సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లను తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేస్తోంది. అయితే ఆహా వీడియో లో రానున్న సరికొత్త కార్యక్రమం ఆహా భోజనంబు. అయితే ఈ కార్యక్రమం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మంచు లక్ష్మి.

మంచు లక్ష్మీ గతం లో పలు కార్యక్రమాలను చేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే తాజాగా ఆహా భోజనంబు తో త్వరలో మన ముందు కు రాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం కి విశ్వక్ సేన్ ముందుగా వస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆహా వీడియో సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతున్న విషయాన్ని వెల్లడించారు.

సంబంధిత సమాచారం :