ఆర్ ఆర్ ఆర్ స్టార్ భారీ హిస్టారిక్ మూవీ జనవరిలో

Published on Oct 21, 2019 2:56 pm IST

ఎన్టీఆర్,చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీలో బాలీవుడ్ నుండి స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్, హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్న అజయ్ దేవ్ గణ్ తన్హాజి అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడైన తన్హాజి వీరోచిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించారు.

వచ్చే ఏడాది జనవరి 10న తన్హాజి చిత్రం విడుదల చేస్తున్నట్లుగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అజయ్ దేవ్ గణ్ భార్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన కాజోల్ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ మరియు అజయ్ దేవ్ గణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. డిసెంబర్ 27న విడుదల కావాల్సివుండగా, జనవరి 10కి వాయిదా వేశారు.

సంబంధిత సమాచారం :

More