హైదరాబాద్‌లో అమితాబ్-అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లోని ‘మే డే’ షూటింగ్ స్టార్ట్

హైదరాబాద్‌లో అమితాబ్-అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లోని ‘మే డే’ షూటింగ్ స్టార్ట్

Published on Dec 11, 2020 7:31 PM IST

ajay

బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్ ప్రధాన పాత్రలో, ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా ‘మే డే’. అయితే ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత అజయ్‌ దేవగణ్ ఒక్కడే కావడం ఓ విశేషం కాగా, తొలిసారి ఆయన అమితాబ్‌ బచ్చన్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ స్టార్‌ హీరోలిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది కావడం మరో విశేషం. అజయ్‌ దేవగణ్‌ ఎఫ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అంగీరా ధార్‌ కథానాయికలుగా ఉన్నారు.

అయితే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ఈ రోజే మొదలయ్యింది. అయితే తొలి సన్నివేశానికి అజయ్‌ దేవగణ్‌ స్నేహితుడు, ప్రముఖ తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్‌ ఇచ్చారు. ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘తానాజీ’ చిత్రానికి సైతం ఆయనే క్లాప్‌ ఇచ్చారు. ఆ సెంటిమెంట్‌ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అజయ్‌ దేవగణ్‌ ఈ రోజు ‘మే డే’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేస్తామని అన్నారు. అయితే భగవంతుడితో పాటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకుంటున్నానని, నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మద్దతుతో పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ఏప్రిల్‌ 29, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ చిత్రానికి పీఆర్వోగా నాయుడు సురేంద్రకుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా) వ్యవహరిస్తుండగా, చిత్రనిర్మాణ సంస్థ అజయ్‌ దేవగణ్‌ ఎఫ్‌ ఫిల్మ్స్‌, ఛాయాగ్రహణం అశీమ్‌ బజాజ్‌, సహ నిర్మాతలుగా కుమార్‌ మంగత్‌, విక్రాంత్‌ శర్మ, హస్నైన్‌ హుస్సేని, జయ్‌ కనుజియా, సందీప్‌ కెవ్లాని, తార్‌లోక్‌ సింగ్‌ ఉన్నారు.

తాజా వార్తలు