పాన్ ఇండియా లెవెల్లో అజిత్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.!

Published on Dec 24, 2021 4:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో సూపర్ క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ గా వస్తున్న లేటెస్ట్ సినిమా “వలిమై” రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ సమయంలో మేకర్స్ సినిమాకి కావాల్సిన హైప్ ని ఒక్కో సాలిడ్ అప్డేట్ తో ఎక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా సౌత్ ఇండియన్ సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లా దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించారు.

ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాన్ ఇండియన్ రిలీజ్ ప్లాన్స్ ఉన్నాయని బజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. వలిమై హిందీ తమిళ్ అలాగే తెలుగు భాషల్లో రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా అజిత్ వివేగం తర్వాత మళ్ళీ ఆ లెవెల్ హాలీవుడ్ విజువల్స్ తో ఈ సినిమా కనిపిస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :