ఫోటో మూమెంట్ : చెపాక్ స్టేడియం లో సందడి చేసిన అజిత్, శివకార్తికేయన్

ఫోటో మూమెంట్ : చెపాక్ స్టేడియం లో సందడి చేసిన అజిత్, శివకార్తికేయన్

Published on Apr 26, 2025 2:01 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 25న జరిగిన చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి గతంలో ఉన్న రికార్డు ఈ సీజన్‌లో మారిపోయింది.

ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు చాలా మంది అభిమానులు హాజరయ్యారు. వారితో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. వారిలో తమిళ స్టార్ హీరో అజిత్ తన భార్య శాలినితో వచ్చాడు. అటు మరో హీరో శివ కార్తికేయన్ కూడా తన భార్య ఆర్తితో ఈ మ్యాచ్ చూడటానికి వచ్చారు.

ఈ క్రమంలో శివకార్తికేయన్ ఆయన భార్య ఆర్తి, అజిత్-శాలినిలతో కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఒక చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ చూసేందుకు.. తమ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు ఇద్దరు తమిళ హీరోలు తమ ఫ్యామిలీతో రావడం సంతోషంగా ఉందని తమిళ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు