అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాత గా మారి ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలిసిందే. ఇక ఈ చిత్రానికి కేవలం 4కోట్లబడ్జెట్ మాత్రమే పెట్టనున్నారని సమాచారం. నూతన దర్శకుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కించనున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రకు సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ ను తీసుకోగా మిగితా పాత్రల్లో అందరు కొత్త వారే నటించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాల బైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


