హిట్ డైరెక్టర్ తో అఖిల్ ?

Published on Aug 25, 2019 11:10 am IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పరుశురామ్, తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదు. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ – అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందట.

పరుశు రామ్ ఆ మధ్య అఖిల్ కి ఒక లైన్ చెప్పినట్లు.. లైన్ విన్న అఖిల్ అండ్ నాగార్జున ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు.

సంబంధిత సమాచారం :