‘అఖిల్’ సెన్సార్ డేట్ ఫిక్స్..!

‘అఖిల్’ సెన్సార్ డేట్ ఫిక్స్..!

Published on Oct 7, 2015 10:00 AM IST

akhil
అక్కినేని వంశం నుంచి మూడో తరంలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ కావడంతో ఈ పేరు అంతటా మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న ఒకే ఒక్క పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నాగార్జున-నాగచైతన్యలు కూడా కనిపించనున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాను సెన్సార్‍కు పంపే డేట్‌ను కూడా సినిమా యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేసింది.

అక్టోబర్ 16వ తేదీన అఖిల్ సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు పంపేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఫిక్స్ చేసుకున్న ఈ సమయానికల్లా సినిమాను పూర్తి చేసేలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. హీరో నితిన్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అఖిల్ అమెరికాలో నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు