అఖిల్ తర్వాతి సినిమాల వివరాలు !

అఖిల్ తర్వాతి సినిమాల వివరాలు !

Published on Feb 9, 2018 2:00 PM IST

‘హలో’ సినిమా తరువాత అఖిల్ చెయ్యబోతున్న సినిమా పై రకరకాల వార్తలు వచ్చాయి. సుకుమార్, సత్య పినిశెట్టి లాంటి దర్శకుల పేర్లు వినిపించినా ఇంతవరుకు ఏ దర్శకుడు ఖరారు అవ్వలేదు. అయితే ఒక పెద్ద దర్శకుడే అఖిల్ తో సినిమా చెయ్యబోతునట్లు తెలుస్తోంది.

గతంలో ‘హలో’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ మాట్లాడుతూ జనవరి 10 న తన కొత్త సినిమాను అనౌన్స్ చెయ్యబోతున్నానని అన్నారు. కానీ ఆయన నుండి కూడా ప్రకటన ఏమీ రాలేదు. తాజా సమాచారం మేరకు అఖిల్ చెయ్యబోయే తరువాతి రెండు సినిమాలు రానా నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. అయితే మంచి కథ, దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు