షూటింగ్ మొదలుపెట్టేసిన అఖిల్!
Published on Nov 29, 2016 9:28 am IST

akhil
‘అఖిల్’ అనే సినిమాతో గతేడాది హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్, ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో రెండో సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అఖిల్ విడుదలై సంవత్సరం దాటాక దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తన కొత్త సినిమా ఉంటుందని ఈమధ్యే తెలియజేశారాయన. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతుంటే, తాజాగా అఖిల్ ఓ యాడ్ షూట్‌తో కెమెరా ముందు నిలబడేందుకు చాలాకాలం తర్వాత రెడీ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.

మౌంటేన్ డ్యూ‍కు ఎప్పట్నుంచో అంబాసిడర్‌గా ఉన్న అఖిల్, ఆ బ్రాండ్ యాడ్ షూట్ కోసం నేడు మడ్ ఐలాండ్ వెళ్ళారు. ఓ మంచి యాక్షన్ సీన్‌తో ఈ యాడ్ ఉంటుందట. మౌంటేన్ డ్యూ యాడ్ డిజైన్ చేసిన టీమ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని అఖిల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక డిసెంబర్ 9న శ్రేయా భూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థం వైభవంగా జరగనుండగా, ఆ తర్వాతి వారం నుంచి ఆయన తన కొత్త సినిమా షూట్‌ను మొదలుపెడతారు. పలువురు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమా కోసం నాగార్జున కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 
Like us on Facebook