దీపావళికి రాబోతున్న అక్షయ్‌ కుమార్‌ ‘సూర్యవంశీ’..!

Published on Sep 25, 2021 11:18 pm IST


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యవంశీ’. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రల్లో నటించారు. కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమైనట్టు తెలుస్తుంది.

అయితే కరోనా అదుపులోకి రావడంతో మహారాష్ట్రలో అక్టోబర్ నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపధ్యంలో నవంబర్ మొదటి వారంలో ‘సూర్యవంశీ’ సినిమా విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ఇప్పటికే ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నా థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :