మాతృవియోగం తో భావోద్వేగానికి లోనైన అక్షయ్.!

Published on Sep 8, 2021 1:58 pm IST


బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన సెలెబ్రెటీస్ లో కూడా ఒకరు. మరి ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తూ వస్తున్న అక్షయ్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. తన తల్లి శ్రీమతి అరుణ భాటియా ఈరోజు బుధవారం తన తుది శ్వాస విడిచారు. దీనితో అక్షయ్ కుమార్ ఈ వార్తని భావోద్వేగంగా ప్రతి ఒకరితో పంచుకున్నారు.

“ఆమే నా ప్రధాన మూలాధారం, ఇప్పుడు గుండె లోతుల్లో చెప్పలేనంత బాధని భరిస్తున్నాను. నా తల్లి శ్రీమతి అరుణ భాటియా ఈరోజు ఉదయం శాంతియుతంగా కన్నుమూసి స్వర్గస్థులు అయ్యి మా నాన్న గారితో మరో ప్రపంచంలో ఏకం అయ్యారు. మీ ప్రార్థనలను గౌరవిస్తున్నాను, ఓం శాంతి” అని అక్షయ్ తెలిపారు. దీనితో పలువురు సినీ తారలు అక్షయ్ కి ప్రఘాడ సానుభూతిని తెలియజేయడమే కాకుండా తమ నివాళులు అర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :