ఆలా వైకుంఠపురములో బన్నీ ఎలా ఉంటాడో చూస్తారా…!

Published on Sep 1, 2019 3:00 am IST

బన్నీ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఐతే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు ఉదయం 9:00 లకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో బన్నీ, మెడలో కండువా, పెరిగిన జుట్టుతో మిడిల్ క్లాస్ పక్కింటి కుర్రాడి గెట్ అప్ లో కనిపించాడు. ఐతే షూటింగ్ సెట్స్ నుండి లీకైన కొన్ని ఫోటోలలో బన్నీ ఎంప్లొయీ లుక్ లో కనిపించారు. మరి రేపు విడుదలయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ లుక్ ఎలావుంటుంది అనేది ఆసక్తికరం.

సంబంధిత సమాచారం :