‘అల వైకుంఠపురములో’ స్పెషల్ ఈవెంట్ రద్దయింది !

Published on Jan 23, 2020 12:15 pm IST

అల్లు అర్జున్ యొక్క ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. అందుకే కొద్ది రోజుల క్రితమే వైజాగ్‌ లో ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది, అయితే అభిమానుల కోసం రేపు తిరుపతిలో ఈ సినిమా స్పెషల్ సక్సెస్ ఈవెంట్ కి సంబంధించి మరో ప్రత్యేక కార్యక్రమం జరగాల్సి ఉంది.

కానీ బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించడంతో తిరుపతిలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని చిత్రబృందం రద్దు చేసింది. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ అల్లు అర్జున్‌ తల్లి నిర్మలాదేవికీ స్వయానా అన్నయ్య అవుతారు. చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్‌ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం బన్నీకి తీరని లోటు.

సంబంధిత సమాచారం :

X
More