అదే ఫ్రెష్ ఫీల్ లో “అల వైకుంఠపురములో” హిందీ టీజర్.!

Published on Jan 18, 2022 4:12 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ భారీ హిట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ కాస్తా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో చేసిన సినిమా “పుష్ప” తో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.

ఇక ఈ సినిమా హిందీలో భారీ హిట్ కావడంతో మేకర్స్ ఈ గ్యాప్ లో అల వైకుంఠపురములో సినిమాని కూడా హిందీ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ చేశారు. మరి వచ్చే జనవరి 26న రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ హిందీ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇది కూడా మళ్ళీ ఫ్రెష్ గా అనిపిస్తుంది.

అదే కొత్త ఉత్సాహంతో ఈ టీజర్ లో విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కనిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమాకి కూడా అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుందనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ లో ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఏ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా హిందీలో గోల్డ్ మైన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :