‘దేత్త‌డి హారిక‌’ది ఫేక్ ఎలిమినేష‌నే !

Published on Sep 20, 2020 11:07 pm IST

బిగ్‌ బాస్ నాలుగో సీజ‌న్‌లో రెండో ఎలిమినేష‌న్ లో క‌‌రాటే క‌ల్యాణి ఎలిమినేట్ అయిపొయింది. ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశాకా… ఇక్క‌డితో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి కాలేదు, డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉందంటూ నాగ్ ఇచ్చిన ట్విస్ట్ గురించి తెలిసిందే. దాంతో అందరూ నేడు మ‌రో కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి ఎలిమినేట్ చేయనున్నారని అనుకుంటే.. ఫేక్ ఎలిమినేష‌న్ ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. దేత్త‌డి హారిక‌ను ఎలిమినేట్‌ చేస్తునట్లు హడావుడి చేసి చివరకు ఫేక్ ఎలిమినేషన్ తో సరిపెట్టారు.

మూడో సీజ‌న్‌లో కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను ఇలాగే ఎలిమినేట్ అని చెప్పి, ఆ త‌ర్వాత సీక్రెట్ రూమ్‌లోకి పంపించి.. అత‌డి చేత మళ్ళీ రీఎంట్రీ ఇప్పించారు. అదేవిధంగా ఈ సీజ‌న్‌లో హారిక ఫేక్ ఎలిమినేష‌న్ తో హడావుడి చేసి.. నేటి షోను ఇంట్రస్ట్ గా చూసేలా చేశారు. ఇక ఇంటి స‌భ్యులంద‌రితోనూ నాగ్ గేమ్స్ ఆడించారు.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4కు కూడా బాగానే ఆకట్టుకుంటుంది. గత సీజన్ లోనూ హోస్ట్ గా చేసి షోకి టాప్ టీఆర్పీ రేటింగ్ ను అందించిన నాగార్జున, మళ్ళీ ఈ సారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి కంటెస్టెంట్లతో సహా బాగానే ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More