“వాల్తేరు వీరయ్య” హిందీ రిలీజ్ పై ఆసక్తి.!

“వాల్తేరు వీరయ్య” హిందీ రిలీజ్ పై ఆసక్తి.!

Published on Dec 30, 2022 7:03 AM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి తెలుగులో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం అంతకంతకూ అయితే హైప్ ని పెంచుకుంటూ వెళ్తుంది.

అలా ఈ చిత్రంపై మేకర్స్ మంచి ప్రమోషన్స్ తో ఆల్రెడీ హంగామా స్టార్ట్ చేయగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఏకకాలంలో హిందీ రిలీజ్ కూడా చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే హిందీలో ఈ చిత్రం ట్రైలర్ ని కూడా మేకర్స్ అయితే రిలీజ్ చేయగా దీనికి డీసెంట్ రెస్పాన్స్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ ఒకింత ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

హిందీలో మెగాస్టార్ గత రెండు చిత్రాలు కూడా హిందీలో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో ఉన్న రవితేజ కి కూడా హిందీలో మంచి క్రేజ్ ఉంది. దీనితో ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం హిందీలో ఎలా రాణిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా గ్రాండ్ గా ఈ జనవరి 13న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు