సాహో కోసం అందరూ ఒక్కటయ్యారు

Published on Aug 28, 2019 12:59 pm IST

ఎక్కడ చూసినా ఇప్పుడు సాహో గురించే చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాహో మానియా సినీ అభిమానులను ఒక ఊపు ఊపేస్తోంది. అందరి నిరీక్షణకు ఇంకా రెండు రోజులలో తెరపడనున్న తరుణంలో ఒక ఆసక్తికర అంశం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అదేమిటంటే హీరోలకు అతీతంగా అభిమానులు ఈ సినిమాకు మద్దతు ప్రకటించారు. ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఇలా అందరూ సాహో విజయం ఆకాక్షించడం మెచ్చుకోదగ్గ అంశం.

ఎవరో చెప్పినట్లుగా అందరి హీరోల అభిమానులు ఇష్టపడే వాడిగా ప్రభాస్ నిలిచిపోయాడు. దీనితో పాటు సాహో విజయం తెలుగు సినిమా సత్తా చాటడానికి మరో అవకాశంగా భావిస్తున్నారు. బాహుబలి విజయం గాలివాటం కాదని, ఆ స్థాయి చిత్రాలు నిర్మించగల సత్తా తెలుగు పరిశ్రమకు ఉందని నిరూపించుకోవాలంటే సాహో విజయం అనివార్యం అనడంలో సందేహం లేదు. సౌత్ నుండి అతిపెద్ద పరిశ్రమగా టాలీవుడ్ గుర్తింపు పొందాలంటే సాహో భారీ వసూళ్లు సాధించాలి. అందుకే అందరి హీరోల అభిమానులు సాహో భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :