అఫీషియల్ : గాడ్ ఆఫ్ మాస్ తో పాన్ ఇండియా స్టార్ ఫస్ట్ ఎవర్.!

అఫీషియల్ : గాడ్ ఆఫ్ మాస్ తో పాన్ ఇండియా స్టార్ ఫస్ట్ ఎవర్.!

Published on Dec 11, 2022 1:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ వరకు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తన కెరీర్ లో అయితే తన సినిమాలు మినహా బయట షోలు గాని టాక్ షోలలో కనిపించడం కూడా చాలా అరుదుగానే కనిపించింది. కానీ ఫైనల్ గా అయితే పాన్ ఇండియా స్టార్ ఓటిటి ఫస్ట్ ఎంట్రీ ఇప్పుడు నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ తోనే కన్ఫర్మ్ అయ్యింది.

గత కొన్ని రోజులు నుంచి వస్తున్న టాక్ ని ఇప్పుడు మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా వారు ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ బాలయ్యతో కనిపించనున్నాడని డిజైన్ చేసిన వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనితో ఈ సాలిడ్ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సహా బాలయ్య అభిమానులు కూడా మంచి ఆసక్తిని వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు ప్రోమో మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు