లేటెస్ట్..అక్కడ “భీమ్లా నాయక్” భారీ రిలీజ్ కి సర్వం సిద్ధం.!

Published on Jan 25, 2022 12:40 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రం “భీమ్లా నాయక్”. అవ్వడానికి రీమేక్ అయినా అంతకంతకు ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొంటున్నాయి. మరి దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ పవర్ ప్యాకెడ్ మాస్ ఎంటర్టైనర్ ని మేకర్స్ వచ్చే ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

మరి ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 25 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి గాను ఒక క్లారిటీ ఇచ్చేశారట. అందులో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయి రిలీజ్ కి ప్లాన్ చెయ్యాలని వారు చూస్తున్నారట.

దగ్గరలో అన్ని భాషల నుంచి కూడా పెద్దగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో భీమ్లా నాయక్ కు మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి. మరి సమయాన్నే వారు వినియోగించుకోనున్నారట. ప్రస్తుతం అందుకు అన్ని పనులు సెటిల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే “భీమ్లా నాయక్” రిలీజ్ పై మరోసారి క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :