“మల్లీశ్వరి” చెల్లెలు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం

Published on Aug 3, 2019 3:45 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కత్రినా మోడల్ గా కెరీర్ ప్రారభించి హిందీ చిత్రం “బూమ్” తో వెండితెరకు పరిచయమయ్యారు. కానీ పూర్తీ స్థాయి హీరోయిన్ గా పరిచయమైంది మాత్రం తెలుగు చిత్రంతోనే. 2004లో వెంకటేష్ హీరోగా వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “మల్లీశ్వరి” చిత్రంలో కత్రినా టైటిల్ రోల్ చేశారు. ఆతరువాత బాలకృష్ణ కు జోడీగా “అల్లరిపిడుగు” చిత్రంలో కత్రినా నటించారు. ఆ తరువాత బాలీవుడ్ కి పరిమితమైన కత్రినా అక్కడ టాప్ హీరోలతో నటించి, స్టార్ గా ఎదిగారు.

కాగా కత్రినా చెల్లెలు ఇసబెల్లా ఖైఫ్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది.కరణ్ లలిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఆయుష్ శర్మ హీరోగా చేస్తుండగా,సునీల్ జైన్,ఓంప్రకాష్ భట్,ఆదిత్య జోషి,అలోక్ ఠాకూర్ మరియు శంకర్ వార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :