యూఎస్ లోని ప్రతిష్టాత్మకమైన థియేటర్లో ‘స్పైడర్’ విడుదల !
Published on Sep 26, 2017 12:30 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ రేపు భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఈరోజు రాత్రి నుండే ఓవర్సీస్లో ప్రీమియర్ షోల సందడి మొదలుకానుంది. యూఎస్లో అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హాఫ్ మిలియన్ కొల్లగొట్టి ప్రీమియర్ల ద్వారా మిలియన్ డాలర్ ను ఖాతాలో వేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అక్కడి చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా రిలీజ్ ప్లాన్ చేశారు.

అందులో భాగంగా యూఎస్లోని మన్హట్టన్ లోనే ప్రతిష్టాత్మకమైన ఇవాక్ రీగల్ థియేటర్లో షోలను ప్రదర్శించనున్నారు. ఈ థియేటర్లో ఇండియన్ సినిమాల్ని ప్రదర్శించడం చాలా చాలా అరుదని, ఈ ఘనత మహేష్ సినిమాకే దక్కిందని చిత్ర డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంత గ్రాండ్ లెవెల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఏ స్థాయి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

 
Like us on Facebook