ఓటిటిలో అదరగొడుతున్న అల్లరి నరేష్ “ఉగ్రం”.!

Published on Jun 3, 2023 8:00 am IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన కామెడీ ట్రాక్ మార్చి నటుడుగా తాను తనని ప్రూవ్ చేసుకోవాలని ప్రస్తుతం పలు సీరియస్ డ్రామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే దర్శకుడు విజయ్ కనకమేడల తో చేసిన ఇంటెన్స్ కోర్ట్ డ్రామా “నాంది” తో తన కెరీర్ లో మంచి హిట్ అందుకోగా మళ్ళీ అదే దర్శకునితో అయితే తాను చేసిన లేటెస్ట్ సీరియస్ యాక్షన్ డ్రామా “ఉగ్రం”.

అయితే నాంది రేంజ్ లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలవలేదు కానీ అల్లరి నరేష్ లోని సరికొత్త కోణాన్ని చూపించి అబ్బురపరిచింది. ఇక ఈ చిత్రం లేటెస్ట్ గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాగా ఇందులో ఈ చిత్రం అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అయితే ఇండియా వైడ్ రెండో స్థానంలో అయితే ట్రెండింగ్ లో నిలవడం విశేషం. దీనితో అయితే ఓటిటి లో ఈ చిత్రానికి రెస్పాన్స్ అదిరిందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :