కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అల్లరి నరేష్ !

Published on Nov 12, 2019 12:34 pm IST

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్న అల్లరి నరేష్ కి ఎట్టకేలకూ ‘మాహర్షి’తో భారీ హిట్ వచ్చింది. సినిమాలో నరేష్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా నటించనిప్పటికీ.. మహేశ్ బాబు ఫ్రెండ్ గా కథలో చాలా కీలకమైన పాత్రలో నటించడంతో.. ‘మహర్షి’ మహేశ్ బాబుకి ఎంత సంతృప్తిని ఇచ్చిందో.. అల్లరి నరేష్ కి కూడా అంతే సంతృప్తి ఇచ్చింది. ఇక ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమాలో నటిస్తోన్న నరేష్ త్వరలో మరో సినిమాను కూడా మొదలెట్టనున్నాడు.

కాగా కాన్సెప్ట్-ఓరియెంటెడ్ చిత్రం కోసం అల్లరి నరేష్ విజయ్ కనకమెడల అనే కొత్త దర్శకుడితో జతకట్టారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ లో సతీష్ వేగేశ్న నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో నటించనున్న ఇతర తారాగణం మరియు సాంకేతిక విభాగం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :

More