‘విక్రమ్ వేద’ రీమేక్.. ఆయన మనసులో రామ్ చరణ్

Published on Feb 11, 2020 3:00 am IST

తమిళ సూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’ను తెలుగులో రీమేక్ చేయడానికి 2017లోనే ప్రయత్నాలు జరిగాయి. రీమేక్ రైట్స్ దక్కించుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ కథలో మాధవన్ పాత్ర కోసం రానాను, విజయ్ సేతుపతి క్యారెక్టర్లో రవితేజను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే అన్నీ కుదిరితే త్వరలోనే ఈ రీమేక్ చిత్రాన్ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో గీతా ఆర్ట్స్ సంస్థ ఉంది.

నిర్మాత అల్లు అరవింద్ మాధవన్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం చరణ్ రాజమౌళి సినిమాలో చేస్తున్నారు. అది పూర్తవగానే చిరు, కొరటాల సినిమాలో ఒక కీ రోల్, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ ముగిసేనాటికి 2021 ఆఖరు కావచ్చు. సో.. చెర్రీ అంగీకరిస్తే 2022లో అయినా ‘విక్రమ్ వేద’ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :