అల్లు అయాన్ వీడియో పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు!

Published on Nov 8, 2021 8:46 pm IST

అల్లు అయాన్ కి సంబంధించిన ఒక వీడియో నేడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గని ఆంతెం కి సంబంధించిన ఒక విడియో కి అల్లు అయాన్ వర్కౌట్ చేస్తున్న వీడియో ను యాడ్ చేస్తూ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. గని చిత్రం ను అల్లు బాబీ సిద్దు ముద్ద తో కలిసి నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కి అల్లు బాబీ సోదరుడు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అల్లు అయాన్ కి ఇచ్చిన ప్రామిస్ ను ఈ వీడియో తో నెరవేర్చిన విషయాన్ని అల్లు అర్జున్ తాజాగా ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు.

అంతేకాక గని చిత్రం లో హీరోగా నటిస్తున్న వరుణ్ తేజ్ కి, హీరోయిన్ సాయి మంజ్రేకర్ కి, సంగీత దర్శకుడు థమన్ కి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు అల్లు అర్జున్. ఈ చిత్రం ను డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :