బన్నీ తో మరోసారి .. !

Published on Feb 15, 2019 7:02 pm IST

నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం. మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇటీవల వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కోటేస్తున్న క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ను తీసుకోవాలని బావిస్తున్నాడట త్రివిక్రమ్. కాగా పూజా ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత లో నటించగా బన్నీ తో కలిసి డీజేలో నటించింది. ఇక ఈ చిత్రానికి కూడా పూజా హెగ్డే అయితే బాగుంటుందని ఆమెనే తీసుకోవాలనుకుంటున్నారట. అయితే త్వరలోనే ఈసినిమాలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలు సాదించాయి. మరి ఈ చిత్రం కూడా విజయం సాధించింది వీరిద్దరికి హ్యాట్రిక్ ను అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :