చిన్నారి ప్రాణానికి అల్లు అర్జున్ సహాయం !
Published on Nov 5, 2016 1:13 pm IST

allu-arjun

సామాజిక సేవలో మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే చిరు, పవన్, రామ్ చరణ్ లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటే ఇప్పుడు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా లిస్టులో చేరిపోయారు. తాజాగా కాలేయ వ్యాధితో భాదపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి పెద్ద సహాయం చేశారు. వివరాల్లోకి వెళితే భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతిల 7 నెలల బాబు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే వారికి రూ.8 లక్షల సాయం అందించారు.

అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రూ. 13 లక్షల సాయం అందివ్వడంతో నిన్న శుక్రవారం అపోలో ఆసుపత్రిలో చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి ఆపరేషన్ పూర్తయింది. ఈ వివరాలను ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ మనీష్ తెలిపారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వంతో పాటు సహాయం చేసి బిడ్డ ప్రాణాలు నిలబెట్టిన అల్లుఅర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 
Like us on Facebook