ప్రస్తుతం మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహరాజ్ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ ఏక్షన్ డ్రామా “మిస్టర్ బచ్చన్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ని మేకర్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు లేటెస్ట్ షూట్ సంబంధించి అప్డేట్ తెలుస్తోంది.
దీని ప్రకారం సినిమా యూనిట్ ఇప్పుడు యూఎస్ లో కీలక షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో, హీరోయిన్ కూడా పాల్గొననున్నారట. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.