‘రంగస్థలం’ స్థానంలోకి ‘అల వైకుంఠపురములో’

Published on Jan 27, 2020 9:47 pm IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ ఓవర్సీస్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఉన్న అన్ని సినిమాల్లోకి ఈ చిత్రమే ఇప్పటికీ మెరుగైన వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు 3.41 మిలియన్ డాలర్లను దాటింది. దీంతో 4వ స్థానంలో ఉన్న మహేష్ యొక్క ‘భరత్ అనే నేను’ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసి నాల్గవ స్థానంలో నిలబడింది.

అలాగే ఫుల్ రన్ ముగిసేనాటికి చిత్రం 3.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి 3వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’ రికార్డును సులభంగానే అధిగమించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చిత్రంతో అల్లు అర్జున్ యూఎస్లో ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ సృష్టించనున్నాడు. ఇక ఏపీ, తెలంగాణల్లో సైతం చిత్రం నాన్ బాహుబలి రికార్డుల్ని సృష్టిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More