అల్లు అర్జున్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు

Published on May 4, 2021 3:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కూడ ఆయన ‘పుష్ప’ షూటింగ్ కొనసాగించారు. అనేక జాగ్రత్తలు తీసుకున్నా కూడ బన్నీతో పాటు బృందంలోని పలువురుకి వైరస్ సోకింది. లక్షణాలు కనిపించడంతో పరీక్షలకు వెళ్లడం, పాజిటివ్ రిపోర్ట్స్ రావడం జరిగింది. దీంతో ఉన్నపళంగా షూటింగ్ నిలిపివేసి బన్నీ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స కొనసాగించారు ఆయన.

ఆయన ఐసొలేషన్లోకి వెళ్లి ఇప్పటికి ఆరు రోజులు కావిస్తోంది. ఆయన పరిస్థితి బెటర్ అయింది కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వైరస్ లక్షణాలు ఇంకా కొద్దిగా ఉన్నాయని, కోలుకుంటున్నానని, కంగారుపడాల్సింది ఏమీ లేదని బన్నీ స్వయంగా తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు సుకుమార్ చిత్రీకరణను రీస్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఖాళీ సమయంలో తర్వాతి షెడ్యూల్ కోసం ఒక విలేజ్ సెటప్ రెడీ చేయిస్తున్నారట. బన్నీ కోలుకుని పరిస్థితులు చక్కబడగానే అక్కడే షూట్ జరుపుతారట.

సంబంధిత సమాచారం :