ఆర్మీ బేస్ లో మొదటిరోజు ముగించిన అల్లు శిరీష్ !
Published on Nov 5, 2016 6:25 pm IST

allu-sirish-in
ఈ మధ్యే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో అల్లు శిరీష్ మళయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టేశాడు. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న ‘1971’ చిత్రంలో శిరీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 1971 కాలంలో భారత్, పాక్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నైపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మేజర్ రవిడైరెక్ట్ చేస్తున్నాడు.

దీనికి సంబందించిన షూటింగ్ ఇప్పటికే మొదలవగా అల్లు శిరీష్ తన షెడ్యూల్ ను ఈరోజే మొదలుపెట్టాడు. ఈ షెడ్యూల్ రాజస్థాన్ లోని అరుణ్ ఘర్ ఆర్మీ బేస్ లో జరుగుతోంది. ఈ విషయాన్నే తెలుపుతూ షూటింగ్ అక్కడే మరో ఇరవై రోజుల పాటు జరుగుతుందని, 4నెలల తరువాత ఇలా మళ్ళీ షూట్ కి తిరిగిరావడం ఆనందంగా ఉందని శిరీష్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉండటం వలన శిరీష్ డెబ్యూట్ ఫై అక్కడి ప్రేక్షకుల్లో పాజిటివ్ క్రేజే ఉంది.

 
Like us on Facebook